Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాజీ ప్రేమికుల‌కు ఓ మార్కెట్‌.. పాత జ్ఞాప‌కాల‌ను అమ్ముకునే స‌దుపాయం!

  • మార్కెట్ పేరు ఓల్డ్ ఫ్లేమ్స్‌
  • గ్రీటింగ్ కార్డులు, దుస్తులు, బ‌హుమ‌తుల‌ను అమ్ముకోవ‌చ్చు
  • కొనుక్కునేందుకు ఎగ‌బ‌డుతున్న జ‌నం
వియత్నాంలోని హనోయ్‌లో ఓల్డ్‌ ఫ్లేమ్స్‌ అనే మార్కెట్‌ ఉంది. ఇది ప్రత్యేకించి మాజీ ప్రేమికుల కోసం మాత్ర‌మే. ప్రేమ‌లో విఫ‌లమైన వారు ఇక్క‌డికి వ‌చ్చి, వారి వ‌ద్ద ఉన్న మాజీ ప్రేమ జ్ఞాప‌కాల‌ను అమ్ముకోవచ్చు. ప్రేమ‌లో ఉన్న‌పుడు ఇచ్చిపుచ్చుకున్న గ్రీటింగ్‌ కార్డులు, దుస్తులు, బహుమతులు...ఇలా అన్నిర‌కాల వస్తువులను ఇక్కడ అమ్ముకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభ‌మైన ఈ మార్కెట్‌, కొద్దికాలంలోనే చాలా ప్రాచుర్యం సంపాదించుకుంది. విదేశీ ప‌ర్య‌ట‌కులు కూడా ఇక్క‌డికి వచ్చి వారి ప్రేమికులు ఇచ్చిన బ‌హుమ‌తుల‌ను అమ్ముకుంటున్నారు.

అమ్ముకోవ‌డం ద్వారానే ఈ మార్కెట్ పాప్యుల‌ర్ కాలేదు... భ‌గ్న‌ప్రేమికులు అమ్ముకున్న వ‌స్తువుల‌ను కొన‌డానికి కూడా చాలా మంది ముందుకు రావ‌డం వ‌ల్ల కూడా ఈ మార్కెట్ ప్రాచుర్యం పొందుతోంది. వస్తువులను కొనేందుకు వచ్చిన వారు అక్కడి విఫల ప్రేమికుల గాథలను విని వారిని ఓదారుస్తుంటారట. వారు అమ్ముతున్న వ‌స్తువు వెన‌క క‌థ‌ల‌తో పాటు, వారి ప్రేమ విష‌యాల‌ను కూడా భ‌గ్న ప్రేమికులు కొన‌డానికి వ‌చ్చిన వారితో పంచుకుంటున్నార‌ట‌. ఈ మార్కెట్‌కి వ‌చ్చిన ప్రాచుర్యం కార‌ణంగా త్వ‌ర‌లోనే వియ‌త్నాంలోని హోచిమిన్ సిటీలో ఓ శాఖ‌ను కూడా తెరిచే యోచ‌న‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
love failure
memories
lovers
vietnam
hochimin
sales

More Telugu News